‘యాత్ర’ సందడి

0

‘యాత్ర’ సందడి

మహానేత వైఎస్‌రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సదంర్భంగా దేశ విదేశాల్లోని వైఎస్‌ఆర్‌ అభిమానులతో థియేటర్లలో కోలాహలంగా మారాయి. దుబాయ్‌లో చిత్ర ప్రీమియర్‌ షో సందర్భంగా అక్కడి వైఎస్‌ఆర్సీపీ యూఏఈ వింగ్‌ సభ్యులు దివంగత నాయకుడు రాజశేఖర్‌ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భముగా చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలు 2019లో తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్తారన్నారు. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టిన బాబు జనాలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్సీపీ యూఏఈ వింగ్‌కు చెందిన రమేష్‌ రెడ్డి, సోమిరెడ్డి, రమణ, బ్రహ్మానందరెడ్డి, కోటి రెడ్డి, అక్రమ్, కుమార్ చంద్ర, కార్తిక్, రెడ్డయ్య, దిలీప్ జి రెడ్డి, నరసింహ, అమర్, వేణుగోపాల్, యస్వంత్, యాసిన్, మధు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.