ఇది మరో అర్జున్ రెడ్డి…?

0 78

ఇది మరో అర్జున్ రెడ్డి…?

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ తరువాత గీతగోవిందం సినిమాతో ఆకట్టుకున్నాడు. ఈ రెండు సినిమాలు విజయ్ కు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఆ తరువాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆడలేదు. అయితే, ఇప్పుడు ఈ యువహీరో వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా చేస్తున్నారు. ఐదుగురు హీరోయిన్లతో చేస్తున్న ప్రయోగం ఇది. ఇంతమంది హీరోయిన్లను పెట్టి, అడోరబుల్ అడల్ట్ కంటెంట్ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

ఫిబ్రవరి 14 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది. కెఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాకు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది. టీజర్ చూస్తుంటే అర్జున్ రెడ్డి సినిమాను చూస్తున్నట్టు అనిపిస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.