రజినీ బీట్ చేసిన విజయ్..?

0 51

రజినీ బీట్ చేసిన విజయ్..?

vijay Beats Rajinikanth

దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో రజినీకాంత్ ముందు ఉంటాడు.  అయన సినిమాలకు దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్నది.  70 ఏళ్ల వయసులో కూడా కుర్రాడిలా పోరాటాలు చేస్తున్నాడు.  దర్బార్ సినిమాలో రజినీకాంత్ నటన ఎలా ఉండబోతుందో శాంపిల్ గా ట్రైలర్ లో చూపించారు.  ఈ సినిమాను భారీ ఖర్చుతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.  ఈ సినిమా కోసం రజినీకాంత్ రూ. 90 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారు.  

అయితే, ఇప్పుడు రజినీకాంత్ ను విజయ్ బీట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం విజయ్ తన 64 వ సినిమా మాస్టర్ చేస్తున్నారు.  ఈ సినిమాకు లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఇకపోతే, ఈ సినిమా తరువాత విజయ్ తన 65 వ సినిమాను సన్ పిక్చర్స్ పతాకంలో నటిస్తున్నారు.  ఈ సినిమాకోసం అయన ఏకంగా రూ. 100 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది.  ఇప్పటికే ఆయనకు సన్ సంస్థ రూ. 50 కోట్లు చెల్లించినట్టు సమాచారం.  సినిమా స్టార్ట్ అయ్యాక మిగతా మొత్తం చెల్లిస్తారని తెలుస్తోంది.  అయితే, శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం రజిని ఎంత తీసుకుంటున్నారు అన్నది తెలియాల్సి ఉన్నది.  

Leave A Reply

Your email address will not be published.