వెంకీ ఇంట పెళ్లి కళ 

0

వెంకీ ఇంట పెళ్లి కళ


వెంకటేశ్‌ ఇంట పెళ్లి కళ వచ్చేసింది. ఆయన పెద్ద కుమార్తె ఆశ్రిత నిశ్చితార్థం ఈ నెల 6న స్వగృహంలో సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ అధ్యక్షుడు సరేందర్‌రెడ్డి మనవడు వినాయక్‌రెడ్డితో ఆమె మార్చిలో వివాహం జరగనుంది. వెంకటేశ్‌ అన్నయ్య, నిర్మాత సురేశ్‌బాబు ‘చిత్రజ్యోతి’తో మాట్లాడుతూ ‘‘ఈ నెల 24న ఆశ్రిత వివాహం జరుగుతుంది. పెళ్లి వేదిక ఇంకా ఖరారు కాలేదు’’ అని చెప్పారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జైపూర్‌లో పెళ్లి జరుగుతుందని తెలుస్తోంది. ఈ వేడుకకు పలువురు తెలుగు, తమిళ, హిందీ చలనచిత్ర ప్రముఖులు హాజరు కానున్నారట! ఆశ్రిత ఫ్రొఫెషనల్‌ బేకర్‌. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో తరచూ ఫుడ్‌కి సంబంధించిన విశేషాలు పోస్ట్‌ చేస్తుంటారు. వినాయక్‌రెడ్డి డేటా సైంటిస్ట్‌. వీరిద్దరికీ కొన్నేళ్ల నుంచి పరిచయం ఉందట! ప్రేమగా మారిన ఆ స్నేహానికి పెద్దల అనుమతి లభించడంతో వివాహ బంధంతో ఒక్కటవుతున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.