బాగోద్వేగానికి గురైన వెంకటేష్…?

0

బాగోద్వేగానికి గురైన వెంకటేష్…?

బాగోద్వేగానికి గురైన వెంకటేష్...?

‘‘సంక్రాంతికి హిట్‌.. సూపర్‌హిట్‌ అనుకున్నా. ప్రేక్షకులు సూపర్‌డూపర్‌ హిట్‌ చేసేశారు. పదేళ్ల తర్వాత థియేటర్‌కి వెళ్లా. ప్రేక్షకులంతా చాలా నవ్వుతున్నారు. నాకు మాత్రం కన్నీళ్లు వచ్చేశాయి. సంక్రాంతికి ‘బొబ్బిలి రాజా’ ‘చంటి’ నుంచి ‘గణేశ్‌’, ‘ప్రేమించుకుందాం రా’, ‘మల్లీశ్వరి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వరకూ నేను నటించిన ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలు వచ్చాయి.

 కానీ, చాలా రోజుల తర్వాత వినోదాత్మక చిత్రం చేయడం, ప్రేక్షకులు ఆదరించడం సంతోషం’’ అని వెంకటేశ్‌ అన్నారు. వరుణ్‌తేజ్‌తో కలిసి ఆయన నటించిన సినిమా ‘ఎఫ్‌ 2’. ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ అనేది ఉపశీర్షిక. తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లు. అనిల్‌ రావిపూడి దర్శకుడు. ‘దిల్‌’రాజు చిత్ర సమర్పకుడు. శిరీష్‌, లక్ష్మణ్‌ నిర్మాతలు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా సక్సె్‌సమీట్‌ శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ ‘‘కామెడీ అంటే చిరంజీవి, వెంకటేశ్‌గారి చిత్రాలు చూసేవాణ్ణి. ‘మనం ఇలా చేయగలుగుతామా? మనకు ఇంత ఉందా?’ అనుకునేవాణ్ణి. ఈ చిత్రంలో వెంకటేశ్‌గారితో పని చేశాక... ఆయన్నుంచి చాలా స్ఫూర్తి పొందాను. అనిల్‌ సన్నివేశం వివరించాక.. వెంకటేశ్‌గారి పక్కన ఎలా చేస్తామని భయం వేసేది. కానీ, వెంకీగారు ఓ బ్రదర్‌లా చాలా సపోర్ట్‌ చేశారు. త్వరలో ‘ఎఫ్‌ 3’తో ప్రేక్షకుల ముందుకొస్తాం. 

బయట హీరోలకు అభిమాన సంఘాలు, గ్రూపులు ఏవేవో ఉంటాయి. ప్రేక్షకుల అభిమాన హీరో ఎవరైనా వాళ్లందరికీ కామన్‌గా నచ్చే వ్యక్తి వెంకటేశ్‌గారు’’ అన్నారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ ‘‘అనిల్‌ రావిపూడి ‘ఎఫ్‌2’ అని సినిమా ప్రారంభిస్తే... ‘వుయ్‌ 2’ అని హీరోలిద్దరూ మాతో జాయిన్‌ అయ్యారు. విడుదల రోజున ‘ఈ 2... ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అని చాలామంది మెసేజ్‌లు చేశారు. చివరకు, ‘బి 2... బొమ్మ బ్లాక్‌బాస్టర్‌’ అయ్యింది. మా సంస్థలో 31వ చిత్రమిది. సంస్థకు అత్యధిక లాభాలు తెచ్చిన చిత్రమిది. సంక్రాంతికి అద్భుతమైన విజయం అందుకోవడం సంతోషంగా ఉంది’’ అన్నారు. అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘‘వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ మధ్య కెమిస్ట్రీ, వాళ్ల టైమింగ్‌ సూపర్బ్‌. వెంకటేశ్‌గారి దెబ్బ... బాక్సాఫీస్‌ అబ్బా! ఆయనో కామెడీ లైబ్రరీ. ఆయనకు నేను చెప్పేది ఏమీ ఉండదు. ఆయన ఇచ్చే హావభావాల్లో నేను కొన్నిటిని ఏరుకోవడమే. 

వరుణ్‌తేజ్‌ కూడా చాలా కష్టపడ్డాడు. నాకు ఎంతో మద్దతిచ్చాడు. తనతో మళ్లీ మళ్లీ చేయాలనుంది. మా చిత్రబృందమంతా నాకెంతో సహాయం చేశారు. ఈ చిత్రంతో ప్రేక్షకులను వందశాతం నవ్వించడానికి ప్రయత్నించా. ఆ నవ్వు విలువేంటో సంక్రాంతికి ఈ విజయంతో తెలిసింది. ఈ సంక్రాంతి నవ్వుల సంక్రాంతి.. నాకు జీవితాంతం గుర్తుండే సంక్రాంతి’’ అన్నారు

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.