ఒకే సినిమాలో ఇద్దరు బడా డైరెక్టర్లతో సినిమా..?

0 44

ఒకే సినిమాలో ఇద్దరు బడా డైరెక్టర్లతో సినిమా..?

వరుణ్ తేజ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమవుతుందట.ఇంతకూ వరుణ్ తేజ్ నటించబోయే సినిమా ఏంటో తెలుసా! దీనికి ఇద్దరు దర్శకులు చేతులు కలుపుతున్నారట. వివరాల మేరకు డైరెక్టర్ క్రిష్‌తో వరుణ్‌తేజ్‌కు మంచి అనుబంధం ఉంది.

ఆయన నిర్మాణంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేయబోతున్నాడట. సురేందర్ చెప్పిన లైన్ నచ్చడంతో క్రిష్‌, వరుణ్ తేజ్ ఓకే చెప్పేశారట. ఇప్పుడు రచయిత, దర్శకుడు వక్కంతం వంశీతో కలిసి సురేందర్ రెడ్డి స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడట. అంతా ఓకే అయిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఉండే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.