ఉప్పెన మూవీ రన్ టైమ్ ఎంతో తెల్సా….?

0 87

ఉప్పెన మూవీ రన్ టైమ్ ఎంతో తెల్సా….?

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’. ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. కరోనా కారణంగా థియేటర్స్ బంద్ అవ్వడంతో ఈ సినిమా విడుదల విషయంలో క్లారటీ లేదుకానీ. అన్ని సవ్వంగా ఉంటే సమ్మర్ కానుకగా విడుదలై ఆడియన్స్ ని అలరించేది.ప్రస్తుతం థియేటర్స్ తెరుచుకోవడం కోసం చిత్రం యూనిట్ ఎదురుచూస్తోంది. థియేటర్స్ తెరుచుకోగానే, వెంటనే సినిమాని విడుదల చేయాలనే ప్లాన్ తో దర్శక, నిర్మాతలు ఉన్నారట.

ఇదిలా ఉంటేఈ సినిమాకి ఫైనల్ ఎడిటింగ్ జరిగిందని తెలుస్తోంది. 2 గంటల 30 నిముషాల నిడివితో సినిమా ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే సుకుమార్ దగ్గర ఈ సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు అసిస్టెంట్ గా వర్క్ చేసాడు. ఈ నేపధ్యంలో ‘ఉప్పెన’ ఫైనల్ అవుట్ ఫుట్ కి ఎడిటింగ్ సుకుమార్ గైడ్ లైన్స్ తోనే జరిగిందని సమాచారమ్. 2 గంటల30 నిముషాల నిడివి అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే 2 గంటల 10 నిముషాల నిడివితోనే సినిమాలు కంప్లీట్ అయిపోతున్నాయి. 2 గంటల 30 నిముషాల నిడివి అంటే సినిమా చాలా ఇంట్రస్టింగ్ గా ఉండాలి. అప్పుడే నిడివి ఎక్కువైన ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. మరి ఇంత ఎక్కువ నిడివితో ‘ఉప్పెన’ ఎలా ఉంటుందో వేచిచూద్దాం.

Leave A Reply

Your email address will not be published.