ఉపేంద్ర నే కావాలంటున్న మహేష్….?

0 127

ఉపేంద్ర నే కావాలంటున్న మహేష్….?

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘సర్కార్ వారి పాట’ చిత్రం ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రంలో మహేశ్ ఫస్ట్ లుక్ ఇప్పటికే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయగా.. విలన్ పాత్ర కూడా అంతే పవర్ ఫుల్‌గా ఉండనుందని సమాచారం.

అందుకే మహేశ్‌కు తగిన విలన్ కోసం వెతుకుతున్నారు దర్శక, నిర్మాతలు. ముందుగా ఈ క్యారెక్టర్ కోసం ‘ఈగ’ విలన్ కిచ్చా సుదీప్‌ను అనుకున్నప్పటికీ మహేశ్ బాబు మాత్రం విలక్షణ నటుడు ఉపేంద్ర వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. హీరోగా, విలన్‌గా రాణిస్తున్న ఈ కన్నడ హీరో అయితే ఈ రోల్‌కు పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతాడని అభిప్రాయం వ్యక్తం చేశారట మహేశ్.దీంతో ఉపేంద్రను త్వరలోనే సంప్రదించి.. ఒప్పించాలని ట్రై చేస్తోందట మూవీ యూనిట్. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో పట్టాలెక్కించి, వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలనేది మూవీ యూనిట్ ఉద్దేశం.

Leave A Reply

Your email address will not be published.