ఓటీటీలో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..’?

0 42

OTT ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..?

బాహుబలి’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రం తర్వాత శోభూ యార్లగడ్డ నిర్మించిన సినిమా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..’. సత్యదేవ్‌ ప్రధాన పాత్ర పోషించారు. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేం వెంకటేష్‌ మహా దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ‘యు’ సర్టిఫికెట్‌ లభించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. జూన్‌ చివర్లో లేదా జులై ఆరంభంలో ఇది ప్రసారం కాబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో నరేష్‌, హరి చందన, జబర్దస్త్‌ రాంప్రసాద్‌, టీఎన్‌ఆర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సినిమాల్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయడం గురించి తాజా ఇంటర్వ్యూలో వెంకటేష్‌ మహా మాట్లాడారు. ‘మరో రెండు వారాల్లో సినిమా థియేటర్లు ప్రారంభమైనప్పటికీ.. అది ప్రేక్షకులకు ప్రమాదకరమే. ఈ విషయంపై ఇప్పటికే శోభూ, ప్రసాద్‌తో చర్చలు జరిగాయి. జీవితం నిమ్మకాయల్ని ఇస్తున్నప్పుడు నిమ్మరసం చేసుకోవడం ఉత్తమం కదా (పరోక్షంగా పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాలని చెప్పారు)’ అని ఆయన అన్నారు.

అనంతరం ఈ సినిమా కోసం ఎదుర్కొన్న సవాళ్ల గురించి నిర్మాత ప్రవీణ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా షూటింగ్‌ అరకులోని మారుమూల గ్రామాల్లో జరిగింది. అక్కడి వారెప్పుడూ ఫిల్మ్‌ కెమెరా చూడలేదు. దీంతో లొకేషన్‌లో 1000 మందికిపైగా గుమిగూడేవారు. వెంకటేష్‌ సహజమైన శబ్దాల మధ్య షూటింగ్‌ చేయాలి అనుకున్నారు. కష్టపడి అనుకున్నట్లు చిత్రీకరణ చేశాం’ అని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.