త్రివిక్రమ్ కటౌట్ చూసి రాజమౌళి షాక్…?

0 9

త్రివిక్రమ్ కటౌట్ చూసి రాజమౌళి షాక్…?

ఒక సినిమా హిట్టయితే ఆ క్రెడిట్ మొత్తం హీరోలకు వెళ్తుంది. అదే సినిమా ప్లాప్ అయితే దర్శకులపై పడుతుంది. ఇక సినిమా రిలీజ్ సమయంలో హీరోలకు పెద్ద ఎత్తున బ్యానర్లు, కటౌట్లు కడుతుంటారు. కానీ, దర్శకులకు ఇలాంటి కటౌట్ లు కట్టేవారి సంఖ్య చాలా తక్కువ. ఖచ్చితంగా చెప్పాలి అంటే అసలు ఉండదు అని అనుకోవచ్చు. ఇండస్ట్రీలో త్రివిక్రమ్ ను అభిమానించేవారు ఉన్నారు.

బయట కూడా త్రివిక్రమ్ కు ఫ్యాన్స్ ఉన్నారు. త్రివిక్రమ్ సినిమాలను అభిమానిస్తుంటారు. కానీ సినిమా రిలీజ్ రోజున ఆయనకు కటౌట్ లు ఎవరూ పెట్టలేదు. మొదటిసారి అల వైకుంఠపురంలో సినిమాకు ఓ థియేటర్ దగ్గర అల్లు అర్జున్ తో పాటుగా త్రివిక్రమ్ కు కూడా కటౌట్ పెట్టారు. అదికూడా బన్నీకి సమానమైన కటౌట్. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. సినిమా హిట్ లో దర్శకులకు కూడా సమానమైన క్రెడిట్ ఇవ్వాలని చెప్పడానికి ఒక నిదర్శనంగా ఈ కటౌట్ ను చెప్పొచ్చు.

Leave A Reply

Your email address will not be published.