మన తెలుగు హీరోయిన్స్ లకు మారని అందం…

0

మన తెలుగు హీరోయిన్స్ లకు మారని అందం…

మన  తెలుగు  హీరోయిన్  లకు      మారని  అందం...

ప్పట్లో చన్నీళ్లు మీద పోసుకునే ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ వచ్చింది. ఇప్పుడు అలాంటిదే ఓ కూల్ ఛాలెంజ్ హల్‌చల్ చేస్తోంది! మరీ ఐస్ బకెట్ ఛాలెంజ్ అంత క్రేజీనో, కికి ఛాలెంజ్ అంత రిస్కీనో కాదు గానీ.. ఇది కూడా మంచి కిక్కిచ్చే ఛాలెంజే! మరిక ఇంటర్నెట్‌లో ఓ ఛాలెంజ్ అంటూ బయలుదేరాక మన హీరోయిన్స్ ఊరుకుంటారా చెప్పండి?
‘టెన్ ఇయర్స్ ఛాలెంజ్’.. ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అన్న తేడా లేకుండా అంతటా వినిపిస్తోన్న సౌండింగ్! ఇంతకీ, ఈ ‘దశాబ్దం సవాల్’ సంగతేంటంటే.. పదేళ్ల కిందటి ఫోటోతో ఇప్పటి ఫోటోను పక్కన చేర్చి సోషల్ మీడియాలో షేర్ చేయటం! అప్పటికి, ఇప్పటికీ ఎంతగా మారామో, మారలేదో జనానికి చూపించటం! అయితే ఇదంతా ఎవరో మామూలు వాళ్లు చేస్తే పెద్ద న్యూస్ కాదు.. కానీ, హాలీవుడ్ నుంచీ బాలీవుడ్ దాకా కాలానికి ఎదురీదే అందగత్తెలు చేస్తే? నెటిజన్స్ నోరెళ్లబెట్టాల్సిందే! అదే జరుగుతోంది పదేళ్లు గడిచినా మాయని అందాలతో మురిపిస్తున్నారు చాలా మంది.
‘పదేళ్ల పందెం’ అంటూ బరిలోకి దిగిన అందగత్తెల్లో… నిన్నా మొన్నా ఫీల్డ్ లోకి వచ్చిన వారే కాదు.. దశాబ్దం కిందే సూపర్ స్టార్‌డమ్ ఉన్న వారు కూడా ఉన్నారు. ఐశ్వర్య పోస్ట్ చేసిన కాన్స్ రెడ్ కార్పెట్ స్టిల్సే అందుకు ఉదాహరణ. ఐశ్వర్య లాగే బీ-టౌన్ సీనియర్ బ్యూటీస్ బిపాషా, డెయిజీ షా, దియా మీర్జా, కిమ్ శర్మ, పద్మాలక్ష్మి, ప్రియాంక చోప్రా, షమిత, శిల్పా శెట్టీలు కూడా పదేళ్ల ముందు, పదేళ్ల తరువాత ఫోటోలు పోస్టు చేశారు. వీరే కాక మిసెస్ కోహ్లీ.. మన అనుష్క శర్మ కూడా.. ‘టెన్ ఇయర్స్ ఛాలెంజ్’ మిస్ అవ్వకుండా ఫోటోతో అలరించింది. ఇక తెలుగు ఆడియన్స్‌కి బాగా పరిచయమున్న సౌందర్య రాశుల్లో… ఇప్పటి వరకూ ‘టెన్ ఇయర్స్ ఛాలెంజ్’ యాక్సెప్ట్ చేసిన వారుగా.. అనిత, శ్రుతి హాసన్, సోనమ్ కపూర్లను చెప్పుకోవచ్చు. మరోవైపు డయానా పెంటీ, ఈషా గుప్తా, మిసెస్ జహీర్ ఖాన్.. సాగరిక, సారా జేన్‌తో పాటూ కరణ్ జోహార్, రాజ్ కుమార్ రావ్, సోనూ సూద్ లాంటి మేల్ సెలబ్రిటీలు కూడా తమ టెన్ ఇయర్ పిక్స్‌తో ఆకట్టుకున్నారు. చూడాలి మరి.. ముందు ముందు ఇంకా ఎందరు ఈ ‘పదేళ్ల పందెం’లో పాల్గొంటారో! మన తెలుగు, దక్షిణాది సినిమా వాళ్ల హంగామా ఎలా ఉంటుందో!

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.