ఈ నెల 22న మహానాయకుడు

0

ఈ నెల 22న మహానాయకుడు

నందమూరి తారక రామారావు జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌ చిత్రీకరణ పూర్తయింది. బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మించిన ‘యన్‌.టి.ఆర్‌ – మహానాయకుడు’ చిత్రానికి శనివారం గుమ్మడికాయ కొట్టేశారు. హైదరాబాద్‌లోని సారథీ స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో చివరి రోజు చిత్రీకరణ చేశారు. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, బసవతారకం పాత్రలో విద్యా బాలన్‌, నందమూరి హరికృష్ణగా కల్యాణ్‌రామ్‌ పాల్గొనగా కీలక సన్నివేశాలను దర్శకుడు క్రిష్‌ చిత్రీకరించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు సమాచారం. బయోపిక్‌ రెండో భాగమైన మహానాయకుడులో ఎన్టీఆర్‌ రాజకీయ ప్రస్థానం, సినిమాల్లో పునః ప్రవేశం తదితర అంశాలు ఉంటాయని తెలుస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.