‘శ్రీదేవి సోడా సెంటర్‌’ రైట్స్.. మరి అంత రేట్.

0 88

‘శ్రీదేవి సోడా సెంటర్‌’ రైట్స్.. మరి అంత రేట్..?

#Sridevisodacenter #Sudheerbabu #Anandhi #cineupdates

కథాంశంతో ఈ చిత్రం రూపొందొంది. ఇందులో సుధీర్‌.. లైటింగ్‌ సూరిబాబు పాత్రలో కనిపించనున్నారు. ‘బస్‌స్టాప్‌’ చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన ఆనంది ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.

ఈ నెలలో కొత్త సినిమాల వరసపెట్టి రిలీజ్ లు అవుతున్నాయి. ఒకదాని వెంట మరొకటి విడుదల తేదీల్ని ఫిక్స్ చేసుకుంటాయి. ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుధీర్‌బాబు, ఆనంది ప్రధాన పాత్రధారులుగా… కరుణకుమార్‌ తెరకెక్కించిన చిత్రమిది. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియా వ్యాప్తంగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు చాలా మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియెట్రికల్ రైట్స్ 12 కోట్లకు అమ్ముడయ్యాయి. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ శ్రీదేవి సోడా సెంటర్ హక్కులను సొంతం చేసుకున్నారు.

కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను వీలైనంత వరకు భారీగానే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు లక్ష్మణ్ . ఈయన ఈ మధ్యే విడుదలై బ్లాక్‌బస్టర్ అయిన జాతి రత్నాలు సినిమాను లక్ష్మణ్ గారు డిస్ట్రిబ్యూట్ చేసారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

‘పలాస’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు కరుణ కుమార్‌. ఇప్పుడాయన రెండో చిత్రంగా ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ను తెరకెక్కించారు. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రమిది. విజయ్‌ చిల్లా, శశి దేవి రెడ్డి నిర్మించారు. మణిశర్మ స్వరాలందించారు. 80ల కాలం నాటి అమలాపురం నేపథ్యంగా సాగే ఓ విభిన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందొంది. ఇందులో సుధీర్‌.. లైటింగ్‌ సూరిబాబు పాత్రలో కనిపించనున్నారు. ‘బస్‌స్టాప్‌’ చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన ఆనంది ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. బస్ స్టాప్ .. తర్వాత తమిళం చిత్రసీమకు పరిమితమైంది. రీసెంట్ గా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెర కెక్కిన ‘జాంబిరెడ్డి’ చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సుధీర్‌ బాబు సరసన మెరవనుంది.

Leave A Reply

Your email address will not be published.