పవన్ కి హ్యాండ్ ఇచ్చిన శ్రుతి…?

0 91

పవన్ కి హ్యాండ్ ఇచ్చిన శ్రుతి…?

#PawanKalyan #ShrutiHaasan #CineUpdates

పవన్ కల్యాణ్‌కి శ్రుతీ హాసన్ షాక్ ఇచ్చిందా..? అంటే అవుననే మాటనే వినిపిస్తోంది ఫిలింనగర్ వర్గాల్లో. పవన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న వకీల్ సాబ్‌లో హీరోయిన్‌గా శ్రుతీ ఎన్నికైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తరువాత వీరిద్దరిపై సన్నివేశాలను తెరకెక్కిస్తామని దర్శకుడు వేణు శ్రీరామ్ సైతం ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు రీసెంట్‌గా శ్రుతీ హాసన్ కూడా పవన్ సినిమా గురించి ఇప్పుడేం చెప్పనని చెప్పి.. ఫ్యాన్స్‌ని ఊరించింది. ఇక త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీ యూనిట్‌కి తాజాగా శ్రుతీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి లోక నాయకుడి తనయ తప్పుకున్నట్లు సమాచారం. కొన్ని కారణాల వలన ఈ సినిమా నుంచి శ్రుతీ తప్పుకుందని టాక్ నడుస్తోంది.

మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే….కాగా హిందీలో భారీ విజయం సాధించిన పింక్ రీమేక్‌గా వకీల్ సాబ్‌ తెరకెక్కబోతోంది. ఇందులో పవన్ న్యాయవాది పాత్రలో కనిపించబోతున్నారు. నివేథా, అంజలి, అనన్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు రెండున్నర్ర సంవత్సరాల తరువాత పవన్ రీ ఎంట్రీ ఇస్తోన్న ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.