కలిసివచ్చిన ‘మజ్ను’ టైటిల్
కలిసివచ్చిన ‘మజ్ను’ టైటిల్
అఖిల్, హలో తరువాత అఖిల్ చేస్తున్న సినిమా మిస్టర్ మజ్ను. ప్లే బాయ్, షార్ట్ టైమ్ లవర్ పాత్రల్లో అఖిల్ కనిపించబోతున్నాడు. మజ్ను టైటిల్ తో గతంలో రెండు సినిమాలు వచ్చాయి. రెండు మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి. రెండు సినిమాలు విషాదంతో కూడిన ఎండింగ్ లు ఉంటాయి. గుండె లోతుల్లో గూడుకట్టుకున్న ప్రేమను అద్భుతంగా చూపించారు కాబట్టి ఆ రెండు సినిమాలు హిట్టయ్యాయి.
ఇప్పుడు వస్తున్న మిస్టర్ మజ్ను సినిమా వాటికి పూర్తి డిఫరెంట్ గా ఉంటుంది. ప్లే బాయ్ గా అఖిల్ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటాడు. షార్ట్ టైమ్ లవర్ గా, అమ్మాయిల కలల రాకుమారుడిగా అఖిల్ కనిపిస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది.. మరి ఈ సినిమాకు మిస్టర్ మజ్ను టైటిల్ ఎందుకు పెట్టారు. ఈ టైటిల్ తో వచ్చిన రెండు సినిమాలు హిట్ కావడంతో.. ఆ సెంటిమెంట్ కోసం ఈ సినిమాకు మిస్టర్ తగిలించి మిస్టర్ మజ్ను టైటిల్ పెట్టారు. మిస్టర్ అంటే హ్యాండ్ సమ్ అనే అర్ధం కూడా ఉంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పోస్టర్స్ లో అఖిల్ రొమాంటిక్ హ్యాండ్ సమ్ బాయ్ గా కనిపించాడు. చూస్తుంటే.. మజ్ను లాగే మిస్టర్ మజ్ను కూడా అదే రేంజ్ లో హిట్టయ్యేటట్టుగానే కనిపిస్తోంది. చూద్దాం.