సరిలేరు నీకెవ్వరూ సెన్సార్ టాక్

0 5
sarileru Neekevvaru Censor Review

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా ఈనెల 11 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అనేక అంచనాలు ఉన్నాయి.  ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కూడా పూర్తయింది. యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది.  అయితే, సినిమా రిలీజ్ విషయంలో ఇంకా కన్ఫ్యూషన్ కొనసాగుతూనే ఉన్నది.  జనవరి 11 వస్తుందా లేదంటే జనవరి 10 న రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉన్నది.  

ఇక ఇదిలా ఉంటె, సెన్సార్ టాక్ ప్రకారం సినిమాలో కామెడీ అదిరిపోయిందని అంటున్నారు.  సినిమాకు సంబంధించి ట్రైన్ ఎపిసోడ్ ఏకంగా 30 నిముషాలు ఉన్నట్టు సమాచారం.  అంతేకాదు, ఈ సినిమా 2గంటల 40 నిమిషాల నిడివి ఉన్నట్టు తెలుస్తోంది. ట్రైన్ ఎపిసోడ్ మొత్తం వెంకీ సినిమాలో కామెడీ లానే ఆకట్టుకుంటుందని అంటున్నారు.  మరి సినిమా ఎలా ఉన్నదో ఏంటో తెలియాలంటే మాత్రం రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.  

Leave A Reply

Your email address will not be published.