పాన్ ఇండియా మూవీ చేస్తున్నా సమంత…?

0 87

పాన్ ఇండియా మూవీ చేస్తున్నా సమంత…?

#Samantha #SamanthaAkkineni #PanIndia #CineUpdates

స‌మంత‌… జాను త‌ర్వాత కొత్త‌గా సినిమాలేవీ ఒప్పుకోక‌పోవ‌టంతో అభిమానులంతా ఎందుకు ఒప్పుకోవ‌టం లేద‌న్న ఆలోచ‌న‌లో ప‌డ్డారు. కొంద‌రైతే స‌మంత త‌ల్లి కాబోతుంది కాబ‌ట్టి సినిమాలు చేయ‌టం లేద‌ని డిసైడ్ అయిపోయారు. లాక్ డౌన్ లో ఇత‌ర నటీ న‌టులంతా కొత్త క‌థ‌లు వింటూ సినిమాలు ఒప్పుకుంటుంటే… సామ్ మాత్రం చైతూతో ఫుల్ టైం స్పెండ్ చేసింది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ వ‌చ్చింది.

ఎప్ప‌టి నుండో సోనీ పిక్చ‌ర్స ఇండియా స‌మంత‌తో ఓ ఉమెన్ సెంట్రిక్ సినిమా కోసం ప్ర‌య‌త్నిస్తోంది. పాన్ ఇండియా మూవీ కోసం బ‌డ్జెట్ లిమిట్ లేకుండా స‌మంత‌తో సినిమాకు ప్ర‌య‌త్నించింది. ఇప్ప‌టికే సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ కూడా పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది. ఏక‌కాలంలో తెలుగు, త‌మిళ్, హిందీల‌లో సినిమా తెర‌కెక్క‌బోతుంది. ఈ సినిమాకు రీసెంట్ గా స‌మంత ఒకే చెప్పిన‌ట్లు స‌మాచారం.

అమెజాన్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్- సీజన్ 2 షూటింగ్ పూర్తి చేసుకున్న స‌మంత… ఆగ‌స్టు నుండి పాన్ ఇండియా ఫిల్మ్ లో న‌టించ‌నుంది. స‌మంతకు ఇదే మొద‌టి పాన్ ఇండియా సినిమా కావ‌టం విశేషం. సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేయ‌నున్నార‌ట‌. ఇందుకోసం స‌మంత ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.