మహిళాభిమానులు నన్ను చంపరనే అనుకుంటున్నా.. చార్మి

0

మహిళాభిమానులు నన్ను చంపరనే అనుకుంటున్నా.. చార్మి


‘‘రామ్‌ది కష్టపడే తత్వం. సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి. అతని ఎనర్జీ నాకు నచ్చింది. అంతేకాదు… అతనికి సంబంధించిన ప్రతిదీ నాకు ఇష్టమే. నేనిలా అంటున్నందుకు ఆయన మహిళాభిమానులు నన్ను చంపరనే అనుకుంటున్నా’’ అని ఛార్మి సరదాగా ట్వీట్‌ చేశారు. పూరి జగన్నాథ్‌తో కలిసి ఆమె నిర్మిస్తున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో రామ్‌ కథానాయకుడు. ప్రస్తుతం యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా రామ్‌ ముఖానికి మాస్క్‌ ధరించి ఉన్న ఫొటోలను ఛార్మి షేర్‌ చేశారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు పూరి జగన్నాథ్‌ దర్శకుడు. నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ నాయికలు. మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.