హిట్ కోసం దేవ్ హీరోయిన్ …. !

0

హిట్ కోసం దేవ్ హీరోయిన్ …. !


‘‘ఒకప్పుడు నా ప్రయత్నమంతా సినిమా పరిశ్రమలో ఎలాగైనా నిలదొక్కుకోవాలనే. కానీ మనిషి ఆశాజీవి కదా. ఒక కోరిక తీరగానే మరోదానివైపు పరుగులు తీస్తుంటాడు. నేనూ అందుకు అతీతం కాదు. నా దృక్పథంలోనూ చాలా మార్పు వచ్చింది’’ అని అంటున్నారు రకుల్‌. ఆమె నటించిన ‘దేవ్‌’ ఈ నెల 14న విడుదల కానుంది. రకుల్‌ మాట్లాడుతూ ‘‘ఒకప్పుడు నాకు కథల నెరేషన్‌ గురించి పెద్దగా తెలిసేది కాదు. నేను సినిమా పరిశ్రమలో పుట్టి పెరగలేదు. ఒక రకంగా చెప్పాలంటే హై స్కూల్లో ఉన్నప్పటి నుంచే సినిమాలు చూడటం మొదలుపెట్టా. అందుకే ఈ రంగంలోకి రాగానే ముందు ఇక్కడి వాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించా. అంతా అవగాహనకు వచ్చాక కూడా నా ఇష్టాయిష్టాల గురించి ప్రత్యేకంగా ఆలోచించలేదు. కొత్తల్లో ‘కథ బావుంది’ అనిపిస్తే చాలు… అంగీకరించేదాన్ని. ఎందుకంటే ఇక్కడ నిలదొక్కుకోవడం ముఖ్యం. ఓ హిట్‌ తెచ్చుకోవడం అంతకన్నా కీలకం. అలా నా ఖాతాలో హిట్లు పడ్డ తర్వాత… నా దగ్గరకు వచ్చిన కథల్లో నాకు నచ్చే విషయాలేంటి? నచ్చని అంశాలేంటి? అని ఆలోచించడం మొదలుపెట్టా. ఇప్పుడు ఇష్టాయిష్టాలతో పాటు ప్రాధాన్యాలు కూడా మారుతున్నాయి’’ అని చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.