కరోనా పై పలాస హీరో మూవీ…?

0 74

కరోనా పై పలాస హీరో మూవీ…?

latest movie update

#Rakshith #CineUpdates
సింపుల్‌ స్టార్‌ రక్షిత్ ఇటీవల నటించిన చిత్రం ‘పలాస 1978’తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రక్షిత్‌ మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌కు రెడీ అయిపోయాడు. కరోనా నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ”డబ్ల్యూహెచ్‌ఓ”(వరల్డ్‌ హజార్డ్‌ ఆర్డినెన్స్‌) అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. కరోనా సంక్షోభం సమయంలో ఎలాంటి కుట్ర జరిగిందనే నేపథ్యంలో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. హ్యాకింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాను సుధాస్‌ మీడియా సమర్ఫణలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో నిర్మించబోతోంది.

telugu movie news rakshit
రక్షిత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌కు విశేష స్పందన లభిస్తుంది. ”ఐయామ్‌ గోనా టెల్‌ గాడ్‌ ఎవ్రీథింగ్‌” వంటి వైవిధ్యమైన హాలీవుడ్ షార్ట్ ఫిలింతో విమర్శకుల ప్రశంసలతో పాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన దేవ్ పిన్నమరాజు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్‌ను అమెరికా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా, ఇండియా-చైనా బార్డర్‌లో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమాకు సంబంధిచిన మిగతా వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్‌ సభ్యులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.