మూవీ రివ్యూ: పెంగ్విన్

0 171

 

సినిమా: పెంగ్విన్
నటీనటులు: కీర్తి సురేష్, లింగా, మాస్టర్ అద్వైత్ తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణ్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ పలణి
నిర్మాత: కార్తీక్ సుబ్బరాజ్
దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్

మహానటి చిత్రంతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పెంగ్విన్’ గతంలోనే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. తమిళ క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా మారి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను తొలుత థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలని చూసినా, లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.

కథ:
గర్భవతి అయిన రిథమ్(కీర్తి సురేష్) చాలా డిప్రెషన్‌లో ఉంటుంది. తన కొడుకు అజయ్(మాస్టర్ అద్వైత్) ఆరేళ్లుగా కనిపించకుండా పోవడంతో రిథమ్‌కు తరుచూ అదే కలగా వస్తుంది. అయితే తన కొడుకును చార్లీ చాప్లిన్ ముసుగు వేసుకున్న వ్యక్తి కిడ్నాప్ చేశాడని తెలుసుకున్న కీర్తి అతడి కోసం వెతుకుతుంటోంది. ఈ క్రమంలో ఒకరోజు హఠాత్తుగా అజయ్ ప్రతక్ష్యమవుతాడు.కానీ అతడేమీ మాట్లాడలేకపోతాడు. ఇంతకీ అజయ్‌కు ఏమైంది..? అతడిని కిడ్నాప్ చేసింది ఎవరు..? అజయ్‌ను కిడ్నాప్ చేసిన వ్యక్తి మళ్లీ అతడిని ఎందుకు విడిచిపెట్టాడు..? అనేది సినిమా కథ.

విశ్లేషణ:


పెంగ్విన్ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను థియేటర్స్‌లో చూడలేకపోతున్నామనే బాధ ఈ సినిమా చూశాక ప్రేక్షకులకు ఖచ్చితంగా ఉంటుంది. పూర్తి మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాను ఒంటిచేత్తో లాక్కొచ్చింది అందాల భామ కీర్తి సురేష్. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ రాసుకున్న కథనం బాగుండటం, దాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చూపించడంతో పెంగ్విన్ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది.

అటు సెకండాఫ్‌లో తన కొడుకు ఇలా ఎందుకు మారాడో తెలుసుకునే పనిలో కీర్తి సురేష్ చూపే యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా తోడవ్వడంతో సినిమా కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్టులు సినిమాలోని అసలు కథను రివీల్ చేయడంతో సినిమా ఓ మంచి నోట్‌తో ముగుస్తుంది. మొత్తానికి దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ పెంగ్విన్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కించిన ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. కానీ ట్విస్టులను రివీల్ చేసే విధానంలో మరింత కేర్ తీసుకుని ఉంటే సినిమా ఇంకో రేంజ్‌లో ఉండేదనే చెప్పాలి. అటు తెలుగు నేటివిటీకి చాలా దూరంగా ఈ సినిమా ఉండటంతో తెలుగు ఆడియెన్స్‌కు పెంగ్విన్ పెద్దగా నచ్చకపోవచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్:


పెంగ్విన్ చిత్రాన్ని కీర్తి సురేష్ ఒంటిచేత్తో లాక్కొచ్చింది. తన పర్ఫార్మెన్స్‌తో నూటికి నూరు శాతం ఈ సినిమాకు పూర్తి న్యాయం చేసింది ఈ బ్యూటీ. ఓ తల్లిగా తన తప్పిపోయిన కొడుకు కోసం పడే బాధను తన హావభావాల్లో చూపించి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక అజయ్ పాత్రలో నటించిన మాస్టర్ అద్వైత్ కూడా కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు ముఖాలు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవడంతో వారిని పట్టించుకున్న వారే లేరు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:


ఈ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అయితే థ్రిల్లింగ్ అంశాలను రివీల్ చేసే విధానాన్ని మరింత బాగా చేసుంటే ఈ సినిమాకు పూర్తి న్యాయం జరిగేది. మంచి స్టోరీలైన్‌ను తాను అనుకున్న రీతిలో ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు విజయం సాధించాడు. ఇక ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచే రెండు అంశాలు సంగీతం, సినిమాటోగ్రఫీ. సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం ముఖ్యంగా బీజీఎం సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడంలో సహాయపడింది. అటు కార్తీక్ ఫళణి సినిమాటోగ్రఫీతో ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు. కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్:
3/5.0

Leave A Reply

Your email address will not be published.