ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేన…?

0 10

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేన…?

ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేన…?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో కలిసి భారీ బడ్జెట్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉంటే ఈపాటికి చిత్రీకరణ ముగిసేది. ఎన్టీఆర్ తదుపరి సినిమా ప్రారంభమై ఉండేది. కానీ పరిస్థితులపై కరోనా కాటు వేసింది. దీంతో అన్నీ ఆలస్యమవుతూ వస్తున్నాయి. ఎన్టీఆర్ 30 చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రారంభం కానుంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ సినిమా చేయబోతున్నాడు. రీసెంట్‌గా ప్రశాంత్ నీల్ పుట్టినరోజున ఈ విషయంపై అభిమానులకు, ప్రేక్షకులకు మరింత క్లారిటీ వచ్చింది.


ఇప్పుడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్తొకటి హల్‌చల్ చేస్తుంది.రేడియేషన్ సూట్’ పేరుతో వీరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనుంది. దీని హింట్‌ను కూడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇచ్చింది. వచ్చే ఏడాది ‘రేడియేషన్ సూట్‌’లో కలుద్దాం అని నిర్మాణ సంస్థ చేసిన మెసేజ్ ఈ వార్తలకు ఊతంగా మారింది. అయితే ప్రశాంత్ నీల్ తాజా చిత్రం కేజీయఫ్ చాప్టర్ 2 చిత్రీకరణ మిగిలి ఉంది. ఈ సినిమా చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యే లోపు ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాను మొదలెట్టేస్తాడు. దాని పూర్తి చేసి ప్రశాంత్ సినిమాను స్టార్ట్ చేస్తాడని టాక్ వినపడుతోంది.

Leave A Reply

Your email address will not be published.