నీహారిక కు కాబోయే భర్త అతనే …. ?

0 61

నీహారిక కు కాబోయే భర్త అతనే…. ?

#NiharikaKonidela #CineUpdates #VenkataChaifanya

మెగా ఇంట పెళ్లి సందడి మొదలు కాబోతోంది. మెగా ఫ్యామిలీ ఫాన్స్ ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న పెళ్లి నిహారికది. నిహారిక పెళ్లి పై చాలా రూమర్స్ వచ్చాయి. సినిమాలు అంటే ఇష్టం ఉండటంతో నిహారిక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మూడు సంవత్సరాలు మాత్రమే అని ఆ తర్వాత కెరీర్ ఎలా ఉన్న పెళ్లి చేసుకోవాలి అనే ఒప్పందంతోనే మూవీస్ లోకి వచ్చింది నిహారిక.

tollywood news niharika

రీసెంట్ గా తన పెళ్లి న్యూస్ అనౌన్స్ చేసింది నిహారిక. నిహారికది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. ఆమె కాబోయే భర్త పేరు వెంకట చైతన్య జొన్నలగడ్డ. గుంటూర్ ఐజీ ప్రసాద్ రావు గారి కొడుకు చైతన్య. అతడికి ఫోటోగ్రఫీ మరియు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమట. రీసెంట్ గానే ఐఎస్‍బీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు చైతన్య.

ప్రస్తుతం ఒక ఎంఎన్‍సీ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాడు. రీసెంట్ గా అబ్బాయి ఫోటో బయటకు వచ్చింది.ఇలా నిహారికకు కాబోయే భర్త చైతన్య ఫొటోస్ బయటకు వచ్చాయో లేదే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారిక, చైతన్యల జంట చాలా చూడముచ్చటగా ఉన్నారు. గుంటూర్ కి చెందిన చైతన్యతో ఆగస్ట్ 13న నిహారిక ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరగబోతుందట. ఇప్పటికే ఎంగెజ్మెంట్ పనులు కూడా మొదలు పెట్టినట్టు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.