నయనతార తో మళ్లీ రొమాన్స్ చేస్తున్న ప్రభూదేవా

0 70

నయనతార తో మళ్లీ రొమాన్స్ చేస్తున్న ప్రభూదేవా

#Nayantara #PrabhuDeva #CineUpdates

ఒకప్పుడు కొరియోగ్రాఫర్ ,డైరెక్టర్ ప్రభుదేవాతో చెట్టాపట్టాలేసుకు తిరిగి పెళ్ళికి రెడీ అయ్యాక బెడిసి కొట్టింది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుదేవా నయనతార ప్రేమించుకున్నారు. అప్పటికే పెళ్లయినా కూడా ప్రభుదేవా ఈమెను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. ఎన్నో వివాదాలు, గొడవల మద్య వీరి పెళ్లి ఆగిపోయింది. ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత నయన్ కొన్నాళ్ల తర్వాత విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. . ఇద్దరు కూడా ప్రస్తుతం పెళ్లికి సిద్దం అవుతున్నారు. ఇక విఘ్నేష్ శివన్ తో పెళ్లికి రెడీ అయిన నయనతార మళ్లీ మాజీ ప్రియుడు అయిన ప్రభుదేవాతో చేతులు కలపడం గురించి వార్తలు వస్తున్నాయి.

అయితే అసలు విషయం లోకి వెళ్తే, వీరిద్దరి కాంబోలో ఒక సినిమాకు తమిళ ప్రముఖ నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు.కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్ ఇంకా కార్తీ హీరోలుగా సినిమా నిర్మించేందుకు ఐసరాయ్ గణేశ్ అనే నిర్మాత ప్లాన్ చేశారు. చర్చలు పూర్తి అయ్యి షూటింగ్ కు వెళ్లాల్సిన సమయంలో సినిమా ఆగిపోయింది.

మళ్లీ ఇన్నాళ్లకు ఆ సినిమా పట్టాలెక్కించేందుకు ప్రభుదేవా సిద్దం అయ్యాడు. అయితే ఇద్దరు హీరోలకు బదులుగా ఒక్క హీరోతోనే సినిమా చేయాలని భావిస్తున్నాడు.విశాల్ ను అనుకున్న పాత్రకు నయనతారను తీసుకుంటే బాగుంటుందని.. ఇదో లేడీ ఓరియంటెడ్ చిత్రంగా చాలా పవర్ ఫుల్ పాత్రలో నయన్ కనిపించబోతోందట. అన్ని కుదిరితే, వచ్చే ఏడాదిలో ఈ సినిమా పట్టాలెక్కి 2022లో రిలీజవుతుందట.

Leave A Reply

Your email address will not be published.