ఒకే వేదిక పై నందమూరి హీరోస్..?

0 66
nandamuri heros in same dais

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో `ఎంత మంచివాడవురా` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై ఈ చిత్రం తెర‌కెక్కింది. మెహ్రీన్ కథానాయికగా నటించింది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారైంది.  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 8న హైదరాబాద్ లో జరగ‌నుంది.

`ఎంత మంచి వాడ‌వురా` ప్రీ వేడుకకు బాలకృష్ణ – ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజ‌రు కానున్నారు. ఒకే వేదికపై ముగ్గురు నందమూరి హీరోలను చూసే ఛాన్స్ మ‌రోసారి క‌ల‌గ‌నుంది. ఇంత‌కుముందు `ఎన్టీఆర్-క‌థానాయ‌కుడు` వేదిక‌పై బాల‌కృష్ణ‌- తార‌క్ – క‌ళ్యాణ్ రామ్ సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి అలాంటి అరుదైన దృశ్యం క‌నిపించ‌నుండ‌డంపై నందమూరి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమేశ్ గుప్తా- సుభాశ్ గుప్తా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందించారు.

Leave A Reply

Your email address will not be published.