విజయ్ మాస్టర్ మూవీ కీ దర్శకుడు అడ్డుకట్ట..?

0 53

విజయ్ మాస్టర్ మూవీ కీ దర్శకుడు అడ్డుకట్ట..?

లాక్‌డౌన్ ముగిసి థియేటర్లు తెరుచుకున్న వెంటనే `మాస్టర్` చిత్రాన్ని ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వొద్దని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి సీనియర్ దర్శకుడు కేయార్ లేఖ రాశారు. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించిన `మాస్టర్` చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటించాడు. మరో ప్రముఖ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. ఈ సినిమాను ఏప్రిల్ 9వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే లాక్‌డౌన్ కారణంగా కుదరలేదు.

లాక్‌డౌన్ ముగిసి థియేటర్లు తెరుచుకున్న వెంటనే ముందుగా `మాస్టర్` చిత్రాన్నే విడుదల చేయాలని తమిళనాడు థియేటర్ల యాజమాన్య సంఘం నిర్ణయించుకుంది. రెండు నెలలుగా నష్టాల్లో కూరుకుపోయిన తమను ఈ చిత్రం కాపాడుతుందని థియేటర్ల యాజమానులు ఆశలు పెట్టుకున్నారు.

అయితే ఈ సినిమా విడుదలకు వెంటనే అనుమతి ఇవ్వడం మంచిది కాదని కేయార్ సూచించారు. `లాక్‌డౌన్ ముగిసిన వెంటనే థియేటర్లలోనికి `మాస్టర్` చిత్రాన్ని తీసుకురావడం మంచిది కాదు. ఆ సినిమా కోసం వేల సంఖ్యలో అభిమానులు థియేటర్లకు వస్తారు. దాంతో కరోనా మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. అలా జరిగితే విజయ్‌కే చెడ్డ పేరు వస్తుంది. ఆర్థిక వ్యవస్థ, లాభాల కంటే ప్రజల ప్రాణాలకు ఎక్కువ విలువనివ్వాల`ని కేయార్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.