మహేష్ బాబు కి ధీటుగా సుదీప్…?

0 6

మహేష్ బాబు కి ధీటుగా సుదీప్…?

#MaheshBabu #Sudeep #CineUpdates

సరిలేరూ నీకెవ్వరు చిత్రం తో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సూపర్ స్టార్ మహేష్ బాబు, మరొక హిట్ సినిమా కోసం సిద్దమవుతున్నారు. సర్కార్ వారి పాట అంటూ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున టైటిల్ ను అనౌన్స్ చేయడమే కాకుండా, ఆ చిత్రానికి సంబంధించిన ప్రి లుక్ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. అయితే ఈ చిత్రం కథ ఇదే అంటూ ఇప్పటికే పలు కథనాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియా లో, ఫిలింనగర్ చక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రం కూడా చాలా పవర్ ఫుల్ గా సాగే యాక్షన్ సినిమా అని టైటిల్ ను చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఈ చిత్రంలో మహేష్ కి దీటుగా నటించే విలన్ కోసం చిత్ర యూనిట్ అన్వేషణ లో ఉంది.అయితే ఈ చిత్రం లో విలన్ గా కన్నడ స్టార్ హీరో సుదీప్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు లో రక్త చరిత్ర, ఈగ, బాహుబలి చిత్రాలలో తన అద్భుత నటనతో ఆకట్టుకున్న సుదీప్, మరొకసారి మహేష్ బాబు చిత్రం లో మెరిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దర్శకుడు పరశురామ్ సుదీప్ ను సంప్రదించగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే ఈ చిత్రం లాక్ డౌన్ పూర్తి అయిన తరువాత షూటింగ్ జరుపుకొనే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.