కొత్త జీవితాన్ని ప్రారంభించిన మాధవీలత…?

0 6

కొత్త జీవితాన్ని ప్రారంభించిన మాధవీలత…?

తన వివాదాస్పద వ్యాఖ్యలతో సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఏ విషయం గురించైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే మాధవీలత తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఎన్నో నెలల తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆమె తెలిపింది. కొత్త జీవితం ప్రారంభమైందని చెప్పింది. అద్భుతాలు జరిగాయని, అద్భుతాలు జరుగుతాయనే విషయాన్ని తాను నమ్ముతానని తెలిపింది. చాలా సంతోషంగా ఉన్నానని. ఏం జరిగిందో త్వరలోనే ప్రకటిస్తానని చెప్పింది. సోషల్ మీడియాలో మాధవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మాధవీలత తన వివాహం గురించే ఈ విధంగా కామెంట్ చేసి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.