గుడిలో విశ్వరూపం చూపించిన కంగనా

0

గుడిలో విశ్వరూపం చూపించిన కంగనా

గుడిలో విశ్వరూపం చూపించిన  కంగనా

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండిలో ఉన్న ఓ ఆలయంలో నటి కంగనా రనౌత్‌నృత్య ప్రదర్శన ఇచ్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అక్కడ భక్తి పాటలకు ఆమెతో పాటు మరికొందరు మహిళలు కూడా నృత్యం చేశారు. ఆ ప్రదేశంలో ఓ ఆలయాన్ని నిర్మించాలని అనుకుంటున్నట్టు ఇటీవల కంగన తెలిపారు.
ఆమె టైటిల్‌ పాత్ర పోషించిన ‘మణికర్ణిక’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఇదిలా ఉండగా, ఈ సినిమా నిర్మాత కమల్‌ జైన్‌ అస్వస్థతకు గురయ్యారు. ‘‘కష్టానికి ఫలితం దక్కుతున్న ఈ సమయంలో చిత్ర యూనిట్‌కు దూరంగా ఆసుపత్రిలో ఉండటం బాధగా ఉంది. యూనిట్‌ను మిస్‌ అవుతున్నా. త్వరలోనే కోలుకుని వస్తాను. అన్ని పనులను నిర్వహిస్తున్న జీ స్టూడియోస్‌కు ధన్యవాదాలు. మన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘మణికర్ణిక’ సక్సెస్‌మీట్‌లో కలుద్దాం. జై హింద్‌’’ అని కమల్‌ జైన్‌ ట్వీట్‌ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.