జగపతిబాబు వీరారెడ్డి ఫస్ట్ లుక్

0

జగపతిబాబు వీరారెడ్డి ఫస్ట్ లుక్..!

మెగాస్టార్ హీరోగా చేస్తున్న సైరా సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతున్నది. ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కు చెందిన చాలామంది ప్రముఖులు నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి విలన్ రోల్స్ ప్లే చేస్తున్న జగపతిబాబు ఇందులో ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు.

పుట్టినరోజు సందర్భంగా జగపతిబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో జగపతిబాబు వీరారెడ్డి పాత్రలో కనిపిస్తున్నాడు. గడ్డం, లాంగ్ హెయిర్ తో వీరయోధుడిలా ఉన్న ఆ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. దసరా సందర్భంగా సినిమాను రిలీజ్ చేయాలని యూనిట్ ప్రయత్నం చేస్తున్నది.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.