హీరో విశాల్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్

0

హీరో విశాల్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్

హీరో విశాల్ ప్రేమించిన అమ్మాయి  ఎవరో తెలిస్తే  షాక్

‘నా జీవితంలో అత్యంత గొప్ప మార్పు. అవును.. సంతోషం.. చాలా సంతోషం. తన పేరు అనీశా అల్లారెడ్డి. తను నాకు ‘యస్‌’ చెప్పింది. పెళ్లి తేదీని త్వరలోనే వెల్లడిస్తాను’ అంటూ తన పెళ్లి ఫిక్స్ అయిన విషయాన్ని ప్రకటించిన విశాల్.. తాజాగా తన ప్రేమ ముచ్చట్లను కూడా పంచుకున్నారు. తనకు అనీషా ఎలా పరిచయమైంది. వారి ప్రేమ ఎలా చిగురించింది అనే విషయాలను మీడియాతో పంచుకున్నారు విశాల్.

అయోగ్య సినిమా షూటింగ్‌లో భాగంగా వైజాగ్ వచ్చినప్పుడు అనీషా పరిచయమైందని చెప్పారు. ఆ సమయంలో స్నేహితులతో కలిసి అనీషా తనను కలిసి ఆమె నటిస్తున్న ‘మైఖెల్‌’ అనే సినిమా గురించి చెప్పారని తెలిపారు. ఇది వ్యవసాయం నేపథ్యంలో సాగే సినిమా అని, యూనిట్‌కు చెందిన వారంతా వ్యవసాయ దారులేనని చెప్పడంతో.. చిత్రాన్ని విడుదల చేస్తానని తాను చెప్పినట్లు విశాల్ పేర్కొన్నారు. అలా అలా కొన్నిసార్లు అనీశాను కలుసుకున్న తర్వాత ఆమెపై ప్రేమ పుట్టిందని, ఆపై ప్రపోజ్‌ చేశానని అన్నారు. అయితే ఆ తర్వాత ఆమె కొంత సమయం తీసుకుని ఓకే చెప్పిందని అన్నారు. అనీశా కేవలం నటి మాత్రమే కాదు బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి, సామాజిక కార్యకర్త కూడా అని తెలిపారు విశాల్.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.