ప్రేమికుల రోజున అతిలోక సుందరి తొలి వర్ధంతి

0

ప్రేమికుల రోజున అతిలోక సుందరి తొలి వర్ధంతి


అతిలోక సుందరి శ్రీదేవి ఈలోకం విడిచి వెళ్లి ఏడాది కావొస్తుంది. ఆమె మరణించిన రోజు ఫిబ్రవరి 24. అయితే ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న శ్రీదేవి తొలి వర్ధంతి జరుపుతున్నారు. తిథి ప్రకారం ఆ రోజు వర్థంతి వచ్చిందని బోనీ కపూర్‌ కుటుంబం తెలిపినట్టు ముంబై సమాచారం. చెన్నైలో శ్రీదేవి ఇంటిలో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కుమార్తెలు జాన్వీ, ఖుషితో పాటు బోనీ కపూర్‌, ఆయన సోదరుడు అనిల్‌ కపూర్‌ సతీమణి సునీత, మరికొందరు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాలకు హాజరు కానున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.