ఫైటర్ కథ లో ఎటువంటి మార్పు లేదు..?

0 64

ఫైటర్ కథ లో ఎటువంటి మార్పు లేదు..?

#Fighter #VijayDeverakonda #AnanyaPandey #CineUpdates

కరోనా లాక్‌డౌన్ తో షూటింగ్స్, థియేటర్స్ బంద్ అయిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ లకి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించినా.. పెద్ద సినిమాలేవీ ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. లాక్‌డౌన్ తర్వాత లొకేషన్స్ లో మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయ్. ఈ నేపథ్యంలో పలు సినిమాల్లో స్క్రిప్టుల్లో మార్పులు చేర్పులు తప్పడం లేదు. ఈ క్రమంలో ఫైటర్ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫైటర్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్. పాన్ ఇండియా సినిమాగా తెరతెకెక్కుతోంది. ఈ సినిమా స్క్రిప్టులో మార్పుల గురించి ఓ అభిమాని ఛార్మిని అడిగేశాడు.మేడమ్‌ స్క్రిప్టు మార్పులు చేశారని వస్తున్న వార్తలపై దయచేసి స్పష్టత ఇవ్వండి. లొకేషన్‌తో పాటు కొన్ని అంశాల్ని కూడా మార్చారని తెలిసింది’ అంటూ బాధపడుతున్న ఎమోజీని షేర్‌ చేశారు.దీనికి ఛార్మి సమాధానం ఇస్తూ.. ‘ఎటువంటి మార్పు చేయలేదు.. చేసే ప్రసక్తే లేదు. ‘ఫైటర్‌’ స్క్రిప్టు బ్లాక్‌బస్టర్‌.. కరోనా క్రైసిస్‌ పూర్తిగా ముగిసిన తర్వాత షూటింగ్‌ను తిరిగి ఆరంభిస్తాం. ఈ సినిమా విషయంలో మేమంతా సూపర్‌ డూపర్‌ నమ్మకంతో ఉన్నాం. త్వరలోనే ఒరిజినల్‌ టైటిల్‌ను ప్రకటించబోతున్నాం’ అని ఛార్మి వివరణ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.