రెండేళ్ల వయసులోనే మాగజైన్ కవర్ ఎక్కిన రష్మిక మందన్న…

0 75

రెండేళ్ల వయసులోనే మాగజైన్ కవర్ ఎక్కిన రష్మిక మందన్న

#RashmikaMandanna #Rashmika #CineUpdates

రష్మిక మందన్న.. .. తాజాగా తన మొట్టమొదటి కవర్ పేజ్‌ను షేర్ చేస్తూ చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అయింది. ఐదేళ్ల వయస్సులో (2001) మ్యాగజైన్ కవర్ పేజీపై రెండు చేతులకు వాచ్ పెట్టుకుని, క్యూట్ స్మైల్‌తో కనిపిస్తున్న రష్మిక.. ఆ రోజు షూట్ చేయడం నాకు ఇప్పటికీ గుర్తుందని చెబుతోంది. మా అమ్మ ఈ మ్యాగజైన్ దాచిపెట్టి ఇప్పుడు చూపించిందని.. ఇప్పటికీ నా ప్రతీ మ్యాగజైన్‌ను సేవ్ చేస్తుందని వెల్లడించింది. మీ ప్రేమను పొందుతూ ఈ రోజు నేనిలా నిల్చున్నానంటే నిజంగా ఆశ్చర్యపోతున్నానని చెప్పింది.

‘నా కుటుంబాన్ని, స్నేహితులను, నా జీవితంలో జరిగిన విషయాలను, నేను కలిసి వర్క్ చేసిన.. చేస్తున్న వారిని, పోరాడిన ప్రతీ యుద్ధాన్ని, చేరుకున్న ప్రతీ మైలురాయిని ప్రేమిస్తున్నానని’ తెలిపింది రష్మిక.ఇక ఈ పిక్చర్ చూసిన అభిమానులు.. అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం మార్పులేదు, అంతే క్యూట్‌గా ఉన్నారని కాంప్లిమెంట్ ఇస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.