మరో క్యాచీ పదం తో వస్తున్నారు…?

0 9
sarileru neekevvaru

అనిల్ రావిపూడి సినిమాల్లో ఉపయోగించే ఊతపదాలు.. జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. రాజా ది గ్రేట్‌లో ‘హు..హు..హూ..హూ..’ అన్నా, ఎఫ్2లో ‘అంతేగా..అంతేగా’ అన్నా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సంక్రాంతికి విడుదల కానున్న మహేష్ బాబు‌ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో అనిల్ మరో ఊతపదాన్ని పరిచయం చేస్తున్నట్టు టాక్. హీరోయిన్ రష్మిక మందనా ఫ్యామిలీలో అది బాగా వినపడుతుందని అంటున్నారు.

 ‘నెవ్వర్ బిఫోర్… ఎవర్ ఆఫ్టర్’ అనే టైపులో ఈ ఊతపదం ఉండనుందని సమచారం. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్, సంగీత తదితరులు నటించారు. సుమారు దశాబ్దం తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి వెండితెరపై దర్శనం ఇస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.