రికార్డ్ బద్ధలు కొడుతున్న బన్నీ….?

0 19

రికార్డ్ బద్ధలు కొడుతున్న బన్నీ….?

అల్లు అర్జున్ ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య 7మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. ఫేస్ బుక్, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో తనదైన హవా చూపిస్తున్నాడు. బన్నీకి ఫేస్ బుక్‌లో 13.1 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా, ప్రభాస్‌ తర్వాతి స్థానంలో నిలిచారు. ఇక లైకుల పరంగా అల్లు అర్జున్‌ని ఫేస్‌బుక్‌లో 13,098,118 మంది లైక్ చేశారు. లైకుల్లో మాత్రం బన్నీనే టాప్. తాజాగా ఆయన ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 7మిలియన్ క్రాస్ అయింది. బన్నీ సోషల్ మీడియాలో వరుస రికార్డులు క్రియేట్ చేస్తుండడంతో ఆయన అభిమానులు ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు.

అల్లు అర్జున్-సుకుమార్ హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’ రాబోతున్న సంగతి తెలిసిందే.కరోనా ప్రభావం ముగియగానే రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది. ఎర్ర చందనం స్లగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కనుంది. ఇందులో బన్నీ చిత్తూరు జిల్లాకి చెందిన వ్యక్తిగా లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. ఇందులో బన్నీకి జంటగా రష్మిక మందన కనిపించనున్నారు.

బన్నీ లవ్వర్ పాత్రలో నివేదా థామస్ కనిపిస్తారనే ప్రచారం ఉంది. అనసూయ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని.. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నటులు కనిపిస్తారనే ప్రచారం ఉంది. దీనిపై చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.