బ‌న్నీ హీరోయిన్‌కి పెళ్లైపోయింద‌ట‌

0 74

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన `వ‌రుడు` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది భానుశ్రీ మెహ్రా. ఈమె ఎంట్రీ అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వ‌రుడు ప‌క్క‌న వ‌ధువు ఎలా ఉంటుందో విడుద‌ల వ‌ర‌కు కూడా చూపించ‌కుండా దాచిపెట్ట‌డ‌మే అందుకు కార‌ణం. అప్ప‌ట్లో ఈమె అందాన్ని తెర‌పైనే చూశారంతా.

ఆ సినిమా హిట్ట‌య్యుంటే భానుశ్రీ మెహ్రా కెరీర్ ఎలా సాగేదో తెలియ‌దు కానీ… అది కాస్త ఫ్లాప్ అయ్యింది. దాంతో భానుశ్రీకి చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు ద‌క్క‌లేదు. కానీ అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ బండి నెట్టుకొచ్చింది. ప్ర‌స్తుతం `మ‌హాప్ర‌స్థానం` అనే సినిమాలో న‌టిస్తోంది. త‌నీష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ సినిమాలో ఆమె ఒక జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌ని పోషిస్తోంది. ఈ సినిమా ప్రెస్‌మీట్‌లోనే భానుశ్రీ మెహ్రా పెళ్లి విష‌యాన్ని వెల్ల‌డించింది. తాను ఇటీవ‌లే పెళ్లి చేసుకున్నాన‌నీ, అందుకే చిన్న విరామం తీసుకున్నాన‌ని తెలిపింది. వ‌రుడు ఎవ‌ర‌న్న‌ది మాత్రం చెప్ప‌లేదు. పెళ్లి త‌ర్వాత కూడా మ‌ళ్లీ సినిమాల‌పై దృష్టిపెట్ట‌డం విశేష‌మే.

Leave A Reply

Your email address will not be published.