Alludu Adhurs Movie First Look Keka

0 44

Alludu Adhurs Movie First Look

బెల్లకొండ సురేష్ వారసుడి గా గ్రాండ్ గా ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్..మొదటి సినిమాతోనే బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా ఏడాదికి రెండు , మూడు సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ ఇంతవరకు మాత్రం అసలైన హిట్ కొట్టలేకపోయాడు. కథను పెద్దగా పట్టించుకోకుండా..ఏ కథ పడితే..ఆ కథ కు ఓకే చెప్పి ప్లాప్ లు అందుకున్నాడు. ప్రస్తుతం కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి అల్లుడు అదుర్స్ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.

ఈ చిత్రంలో నభ నటేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తుండగా చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30 న ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.