గీతా బ్యానర్లో నటిస్తున్న అక్కినేని సోదరులు

0

గీతా బ్యానర్లో నటిస్తున్న అక్కినేని సోదరులు

అక్కినేని హీరోలకు గత కొంతకాలంగా కలిసిరావడం లేదు. నాగచైతన్య చేసిన సినిమాలు వరసగా ప్లాప్ అవుతున్నాయి. అటు అఖిల్ హీరోగా లాంచ్ చేసిన అఖిల్, రెండో సినిమా హలో, మూడో సినిమాగా వచ్చిన మిస్టర్ మజ్నుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అఖిల్. అటు నాగ చైతన్య కూడా హిట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు.

ప్రస్తుతం నాగచైతన్య .. సమంతతో కలిసి మజిలీ చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. కొన్ని గంటల్లోనే టీజర్ వైరల్ కావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. దీని తరువాత వెంకటేష్ తో కలిసి వెంకిమామ చేస్తున్నాడు. బాబీ దర్శకుడు. ఈ రెండు సినిమాలతో పాటు చైతన్య గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.

గీతా గోవిందం సినిమాతో మంచి హిట్ కొట్టిన పరశురామ్.. ఓ క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీతో కథను రెడీ చేసి అల్లు అరవింద్ కు వినిపించాడట. కథ విన్న అరవింద్.. నాగచైతన్యకు సెట్ అవుతుందని చెప్పడంతో.. ఈ సినిమా నాగచైతన్యతో చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక బన్నీ కోసం కథను రెడీ చేసుకున్న బొమ్మరిల్లు భాస్కర్..ఆ కథతో అఖిల్ హీరోగా గీతా ఆర్ట్స్ లో సినిమా చేయబోతున్నాడు. సో, అక్కినేని సోదరులు ఇద్దరు గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమాలు చేయబోతున్నారన్న మాట.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.