పాయల్ రాజపూత్ కి తప్పని కష్టాలు…?

0

పాయల్ రాజపూత్ కి తప్పని కష్టాలు…?

కష్టాలో ఉన్న సినీనటి  పాయల్ రాజ్‌పుత్

ప్రతి కుటుంబంలోనూ కొన్ని బాధలు ఉంటాయి. అది ఏ రూపమైనా కావచ్చు.. కానీ అవి జీవితంలో ప్రతీక్షణం వెంటాడుతూనే ఉంటాయి. ఆ బాధ నుంచి బయటపడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా అలాగే వెంటాడుతుంటే.. ఇక ఆ బాధ నుంచి త్వరగా బయటపడాలని ఆశగా చూడటం తప్ప చేసేదేముంటుంది చెప్పండి. ఈ పరిస్థితులు సాధారణ ప్రజలకే కాదు సెలెబ్రిటీలకు కూడా వస్తుంటాయి. ఇలాంటి ఓ బాధ పాయల్ రాజ్‌పుత్ కుటుంబాన్ని కలిచివేస్తోందట.
పాయల్ రాజ్‌పుత్ సోదరుడు ధృవ్ రాజ్‌పుత్ గత మూడేళ్ళుగా కనిపించటం లేదట. 25 సంవత్సరాల వయసున్న ఇతను 27మార్చి 2016 నుంచి కనిపించటం లేదని పేర్కొంటూ ట్విట్టర్‌లో అతని ఫొటోను షేర్ చేసింది పాయల్. ‘‘నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా గడవటం కష్టంగా ఉంది. నువ్వు తిరిగి వస్తావని ఆశిస్తున్నాం. ఈ రోజు నీ పుట్టిన రోజు. ఆ దేవుడు నీకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా. నువ్వు మిస్ అయ్యాక అమ్మానాన్నలు చస్తూ బతుకుతున్నారు. ఎంతో బాధ పడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ సందేశం నీకు అందుతుందని భావిస్తున్నా. ఒకవేళ నువ్వెక్కడైనా అనుకోని ఆపదలో చిక్కుకొని ఉంటే.. మాకు కాల్ చెయ్. నీ కోసం మేము ఎదురు చూస్తున్నాం సోదరా..’’ అని సోషల్ మీడియా ద్వారా పేర్కొంది పాయల్ రాజ్‌పుత్.
తన సోదరుడు తప్పిపోయిన విషయాన్ని పలుసార్లు ముంబై పోలీసుల దృష్టికి తీసుకెళ్లి కంప్లైంట్ చేసినా ప్రయోజనం లేదని పాయల్ తెలిపింది. పాయల్ పెట్టిన ఈ సందేశం చూసి.. మీ సోదరుడు త్వరలో తిరిగిరావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.