Saaho Beauty tho Pawan Kalyan…?

0

Saaho Beauty tho Pawan Kalyan..?

సాహో సినిమాలో ప్రభాస్‌ సరసన ఒక ప్రత్యేకగీతంలో నటించింది బాలీవుడ్‌ భామ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌. ఇప్పుడు ఈ భామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో రొమాన్స్ చేయబోతున్నట్టు సమాచారమ్. క్రిష్ దర్శకత్వంలో పవన్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా దేశంలోని ప్రధాన భాషలన్నింటిలోనూ విడుదల కానుంది.

ఈ సినిమా కోసం హీరోయిన్ గా పలువురి బాలీవుడ్ భామలని పరిశీలించిన క్రిష్ జాక్వెలిన్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇదివరకే ఆమె హైదరాబాద్‌కి పలుమార్లు వచ్చి కథా చర్చల్లో పాల్గొన్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. కరోనా ఆంక్షలన్నీ ఎత్తేసిన వెంటనే జాక్వెలిన్‌ షూటింగ్‌లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉందంట.ఈ సినిమాకి మొత్తం 40 రోజులు కేటాయించిందని సమాచారమ్.

Leave A Reply

Your email address will not be published.