గురూజీపై పూనమ్ ఫైర్..ఎవరా గురిజీ..?

0

గురూజీపై పూనమ్ ఫైర్..ఎవరా గురిజీ..?

హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి ఫైర్ అయింది. ఈ సారి డైరెక్ట్ గానే ఎటాక్ చేసింది. ఇంతకుముందు పూనమ్ తరచూ పవన్ పై పడిపోయేది. ఆయనతో పాటు, ఆయన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు అంటూ.. పరోక్ష విమర్శలు చేసేది. తన జీవితాన్ని నాశం చేశాడని శాపనార్థాలు పెట్టేది. తాజాగా మాత్రం గురూజీ అంటూ డైరెక్ట్ గానే ఎటాక్ చేసింది. తన ట్విట్టర్ ఖాతాలో ఓ నోటులాంటిది పోస్ట్ చేసింది.

‘నీ ఫ్రెండ్ తను ప్రేమించే భార్య దగ్గరకి వెళ్లకుండా అడ్డుకున్నావ్. నువ్వు వారి మధ్యలో రావడం వల్లనే అతను అందరితో తిట్లు తింటున్నాడు. పిల్లలు సఫర్ అవుతున్నారు. ఆమె బాధ పడుతూనే ఉంది. అతను బాధ పడ్డాడు. ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నాడు. ఇదంతా ఎందుకు చేసావ్..స్లో పాయిజన్ లాగా అతన్ని చంపాలని చూస్తున్నావా’ అంటూ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా ‘మీ స్వలాభం కోసం మీ ఫ్రెండ్ జీవితాన్ని మానిప్యులేట్ చేసావ్. మీలాగా అతని లైఫ్ నుండి వేరే ఎవరు కూడా ప్రయోజనం పొందారని నేను అనుకోను. యువర్ మానిప్యులేటివ్..

యూ ఆర్ సిక్’ అంటూ #guruji హ్యాష్ ట్యాగ్ పెట్టి మరో ట్వీట్ చేసింది. ఇక టాలీవుడ్ లో గురూజీ అంటే తెలియని వారుండరేమో. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్నేహితుడు, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ అని అందరికీ తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.