పవన్ కళ్యాణ్ సత్య గ్రహి ఫస్ట్ లుక్..?

0
14


pawan kalyan sathya grahi first look

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ‘సత్యాగ్రహి’ అనే టైటిల్‌తో ఒక సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. అయితే, ఇప్పుడు అదే టైటిల్‌తో, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల స్ఫూర్తితో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సత్యాగ్రహి’ చిత్రాన్ని శ్రీ భవిత క్రియేషన్స్ పతాకంపై గంగారెడ్డి నిర్మిస్తుండగా కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను‌ నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం విడుదల చేశారు.

పవన్ కళ్యాణ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఆయన సిద్ధాంతాలను, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సమాజంపై యవత బాధ్యతతో ఉండాలని చెబుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయిన నలుగురు యువకులు సమాజాన్ని మార్చే బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కథాంశం. ఇక ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆసక్తికరంగానే ఉంది. పిడికిలి బిగించిన పవన్, ఆయన ముందు ఉన్న కొంత మంది అభిమానుల క్యారికేచర్‌ను పోస్టర్‌లో ఉంచారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here