Nani V Cinema Vedudhala Vaidhapadinda…

0

Nani V Cinema Vedudhala Vaidhapadinda…?

నేచురల్‌ స్టార్‌ నాని, సుధీర్‌బాబు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘వి’ . నివేదా థామస్‌, అదితిరావు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘అష్టాచమ్మా’, ‘జెంటిల్‌మన్‌’ సినిమాల దర్శకుడు మోహన్‌కృష్ణ ఈ సినిమాతో మరోసారి నానీతో జోడీ కట్టాడు. ఇది నానికి 26వ సినిమా. ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ఈ పాటికే ప్రకటించింది. అయితే ప్రస్తుతం దేశమంతటా కరోనా టెన్షన్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో సినిమా రిలీజ్‌ చేస్తే.. వైరస్‌ దెబ్బకు జనాలు థియేటర్‌ వరకు వస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఇప్పటికే విడుదలైన నాని విలన్‌ లుక్‌, వి టీజర్‌ కు మంచి స్పందన వస్తోంది .

ఇలాంటి సమయంలో సినిమా రిలీజ్‌ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకని నిర్మాత దిల్‌ రాజు ఆలోచిస్తున్నట్లు సమాచారం.ఎందుకైనా మంచిదని, కాస్త కరోనా ఫీవర్‌ తగ్గిన తర్వాతే సినిమా విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం ఉగాదికి కాకుండా మరికొద్ది రోజులు ఆలస్యంగా విడుదల కానుంది. కొత్త రిలీజ్‌ డేట్‌ తెలియాంటే చిత్ర యూనిట్‌ మరో డేట్‌ను ప్రకటించేవరకు ఓపిక పట్టాల్సిందే. కగా ఈ సినిమా నుంచి రిలీజైన ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా..’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సీతారామ శాస్త్రి రచించిన ఈ పాటను అమిత్‌ త్రివేది, శ్రేయా ఘోషల్‌ ఆలపించారు.

Leave A Reply

Your email address will not be published.