ఈ రోజుతో తేలిపోతుంది…?

0
movie release dates

సరిలేరు నీకెవ్వరూ సినిమా ఈనెల 11 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాను మొదట జనవరి 12 వ తేదీన సినిమా రిలీజ్ కావాలి. కానీ, కొన్ని కారణాల సినిమాను జనవరి 12 నుంచి జనవరి 11 వ తేదీకి మారిన సంగతి తెలిసిందే. అయితే, జనవరి 12 న అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నది. కానీ, అల వైకుంఠపురంలో సినిమా జనవరి 12 నుంచి జనవరి 10 మారినట్టు వార్తలు వస్తున్నాయి. థియేటర్ల సమస్యలే ఇందుకు కారణం అని అంటున్నారు.

సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురంలో సినిమాల మధ్య పోటాపోటీ ఉన్నది. రెండు సినిమాలు జనవరి 10 న రిలీజ్ చేస్తారని కొంత టాక్ వచ్చింది. గత నాలుగైదు రోజులుగా ఈ సమస్య చుట్టూనే చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఈరోజుతో చర్చలు పూర్తవుతాయని అంటున్నారు. ఈరోజు రెండు సినిమాల డేట్స్ ఫిక్స్ అవుతాయని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.