Hero Vijay Ke IT Shaka Shock

0

Hero Vijay Ke IT Shaka Shock

తమిళ స్టార్ హీరో విజయ్ ఇంటిపై మరోసారి ఐటీ అధికారులు దాడులు జరపడం తమిళనాట చర్చ గా మారింది. కొన్ని రోజుల క్రితం ఆయన ఇంటిమీద, అతని సంబంధించిన ఆఫీస్ లపైనా దాడులు నిర్వహించి నానా రచ్చ చేసారు. విజయ్ ని అరెస్ట్ కూడా చేయబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది.

ఇప్పుడు మరోసారి విజయ్ ను ఆదాయపన్ను అధికారులు టార్గెట్ చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. నిజంగానే విజయ్ ఆదాయపన్ను కట్టడంలేదా లేదంటే రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఖైదీ ఫేమ్ లోకేష్ డైరెక్షన్లో ‘మాస్టర్’ అనే సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రంలో విజయ్ పాత్ర జేమ్స్ దురైరాజ్ పాత్రలో ఉండబోతుందట. విజయ్ సేతుపతి చిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. అనిరుద్ మ్యూజిక్ అందిస్తుండగా.. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా సోషల్ మెసేజ్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave A Reply

Your email address will not be published.