Full Swing lo Red Movie Business

0

Full Swing lo Red Movie Business Rates

ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ కొట్టిన తరువాత రామ్ చేస్తున్న సినిమా రెడ్. తమిళంలో సూపర్ హిట్ సాధించిన తడం సినిమాకు ఇది రీమేక్. కిషోర్ తిరుమల దర్శకుడు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ ఆకట్టుకోవడంతో బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది.

ఈ సినిమా ఆంధ్ర ఏరియాలో థియేట్రికల్ బిజినెస్ రూ. 11 కోట్ల వరకు జరుపుకోగా, సీడెడ్ ఏరియాలో రూ.4 కోట్ల వరకు జరుపుకుంది. ఏపీ, తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో ఈ సినిమాను స్రవంతి మూవీస్ సంస్థ సొంతంగా రిలీజ్ చేస్తుండటం విశేషం. నివేత పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ లు హీరోయిన్లు. ఇందులో రామ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు.ఏప్రిల్ 9 వ తేదీన సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది.

Leave A Reply

Your email address will not be published.