బాక్సాఫీస్ క్వీన్ 2019 గా తాప్సీ…?

0

బాక్సాఫీస్ క్వీన్ 2019 గా తాప్సీ…?

టాలీవుడ్ లో సొట్టబుగ్గుల సుందరి తాప్సీకి పెద్దగా కలిసిరాలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం దున్నేస్తోంది. 2019లో ఆమె నటించిన ‘బద్లా’, ‘గేమ్‌ ఓవర్‌’తోపాటు మరో మూడు చిత్రాలు విడుదలై.. మంచి టాక్‌ అందుకున్నాయి. తాప్సి సినిమాలు ‘బద్లా’ రూ.88 కోట్లు (మార్చి 8 2019), ‘గేమ్‌ ఓవర్‌’ రూ.4.69 కోట్లు (జూన్‌ 14 2019- కేవలం హిందీలో), ‘మిషన్‌ మంగళ్‌’ రూ.202.98 కోట్లు (ఆగస్టు 15 2019), ‘సాండ్‌కీ ఆంఖ్‌’ రూ.23.40 కోట్లు (అక్టోబరు 25 2010), ‘థప్పడ్‌’ రూ.33.06 కోట్లు (ఫిబ్రవరి 28 2020) మొత్తం రూ.352.13 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తాప్సీ ట్వీట్ చేసింది ఇలా…’హో నైస్‌.. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఈ క్వారంటైన్‌లో ఓ శుభవార్తగా దీన్ని పరిగణించి.. నా ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుని సెలబ్రేట్‌ చేసుకోవచ్చు’ అని ఆనందం వ్యక్తం చేశారు తాప్సీ.

Leave A Reply

Your email address will not be published.