Allari Naresh Cinemalo Kajal Aggarwal…

0

Allari Naresh Cinemalo Kajal Aggarwal…?

ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌గా ఉన్న కాజల్‌ అగర్వాల్‌ త్వరలో కొరియన్‌ సినిమా రీమేక్‌లో నటించనున్నట్లు సమాచారం.ఇప్పటికే గతేడాది సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో సమంత.. ‘ఓ బేబి’ సినిమా చేసిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం కొరియాలో హిట్టైయిన ‘మిస్ గ్రానీ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. తాజాగా 2012లో విడుదలై కొరియన్‌లో సూపర్‌ హిట్‌ సాధించిన ‘డ్యాన్సింగ్‌ క్వీన్‌’ను తెలుగులో సురేష్‌ బాబు తెరకెక్కించనున్నారు.ఇప్పటికే ఈ సినిమా రీమేక్‌ హక్కులను కొనుగోలు చేయగా.. హీరో పాత్రలో అల్లరి నరేష్‌ నటించనున్నారు.

మహేష్‌ బాబు ‘మహర్షి’ సినిమాతో అల్లరి నరేష్‌కు సెంకడ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ అయ్యిందని చెప్పవచ్చు.అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన కాజల్ నటించబోతోన్నట్లు తెలుస్తోంది.ఇందుకు ఇప్పటికే కాజల్‌ను సంప్రదించినట్లు సురేష్‌ బాబు చెప్పారు. అయితే ప్రస్తుతం చర్చ నడుస్తోందని ఈ నెల చివరలో స్పష్టత ఇస్తామంటూ ఆయన వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.